జిల్లాలో భారీగా కార్డెన్ సెర్చ్

BPT: చీరాల, రేపల్లె సబ్ డివిజన్లలో శనివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 244 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 72 వాహనాలను సీజ్ చేశారు. నాటుసారా తయారీకి నిల్వ ఉంచిన 5,000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. చీరాల డీఎస్పీ మోయిన్, రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో 9 మంది సీఐలు, 11 మంది ఎస్సైలు పాల్గొన్నారు.