గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ మృతి

గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ మృతి

KNR: గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ మృతి చెందిన విషాద ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. భరత్ నగర్‌కు చెందిన ఆగమ్మ(85) భర్త వెంకటాచారి(97)కి సేవలందిస్తూ కంటికి రెప్పలా చూసుకునేవారు. బుధవారం రాత్రి అస్వస్థతకు గురైన ఆగమ్మ రాత్రి 11 గంటలకు మృతి చెందారు. దీంతో వెంకటాచారి కూడా తీవ్ర మనోవేదనకు గురై, గురువారం తెల్లవారుజామున 4 గంటలకు మృత్యుఒడికి చేరారు.