VIDEO: ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం: గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు.