రామకృష్ణ మఠానికి వెళ్లనున్న సీఎం

రామకృష్ణ మఠానికి వెళ్లనున్న సీఎం

స్వామి వివేకానంద చికాగో ప్రసంగాల 132వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని HYDలోని రామకృష్ణ మఠం ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈనెల 11న 'సంప్రీతి దివస్ - విశ్వ సోదరభావ దినోత్సవం' పేరిట కార్యక్రమం నిర్వహిస్తోంది. మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో సా.5 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి CM రేవంత్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలో వివేకానందుడి గురించి CM ప్రసంగిస్తారని తెలుస్తోంది.