అగ్నిప్రమాదం.. ఆరు ఎకరాల్లో పత్తి పంట దగ్ధం
NGKL: మానవపాడు మండలలో శనివారం అగ్నిప్రమాదం ఓ కౌలు రైతుకు కన్నీళ్ళు మిగిల్చింది. స్థానిక రైతు సునీల్ రెడ్డి కౌలుకు తీసుకున్న భూమిలో పత్తి సాగు చేశాడు. ఎకరాకు సుమారు 3 క్వింటాళ్ల దిగుబడి ఉన్న తరుణంలో ప్రమాదవశాత్తు పొలంలో మంటలు చెలరేగాయి. గాలి వేగానికి మంటలు వేగంగా వ్యాపించడంతో 6 ఎకరాల్లోని పత్తి పంట పూర్తిగా దగ్ధమైంది. పొలాన్ని చుట్టూ దున్నడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.