అమీర్ పేటలో ఇదీ పరిస్థితి

అమీర్ పేటలో ఇదీ పరిస్థితి

HYD: సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో మహానగరం చిగురుటాకులా వణికింది. రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమీర్ పేట మైత్రివనం సిగ్నల్ దగ్గర భారీగా వరద నీళ్లు రోడ్డుపై నిలిచిపోయింది. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు చర్యలు చేపట్టారు.