జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధరల వివరాలు

KNR: జమ్మికుంట పత్తి మార్కెట్‌లో గురువారం పత్తి ధరలు ఇలా ఉన్నాయి. మార్కెట్‌కు రైతులు 4 వాహనాల్లో 31 క్వింటాల కొత్త పత్తి విక్రయానికి తీసుకురాగా.. రూ. 6,811 నుంచి రూ. 5,011 వరకు పలికింది. అలాగే పాత విడి పత్తిని 2 వాహనాల్లో 53 క్వింటాలు తీసుకురాగా.. రూ. 7,450 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.