పుంగనూరులో రక్తదాన శిబిరం
CTR: పోలీసు అమరవీరుల సంస్మరణ పురస్కరించుకుని పుంగనూరు పట్టణం BMS క్లబ్ ఆవరణలో ఇవాళ రక్తదాన శిబిరం నిర్వహించారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు విరివిగా రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు హరిప్రసాద్, రమణ, సిబ్బంది పాల్గొన్నారు.