రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
SDPT: బెజ్జంకి మండలంలోని బేగంపేట్ గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విధి దీపాల మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామంలో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. కావున ఈ సమయంలో గ్రామ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.