స్పీకర్‌ను కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
AKP: రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఇవాళ స్పీకర్ చాంబర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన శాఖ పరిధిలోని నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతికి సంబంధించిన సమగ్ర నివేదికను స్పీకర్‌కు ఆయన అందజేశారు. రూ.312 కోట్ల నిధులతో 5,628 పనులు మంజూరు చేశామన్నారు.