కూకట్‌పల్లికి ఆర్టీఏ యూనిట్ తరలింపు
MDCL: KPHB నాలుగో ఫేజ్‌లోని ఆర్టీఏ యూనిట్ కార్యాలయాన్ని కూకట్‌పల్లి హెచ్ఎండీఏ స్థలంలోకి త్వరలో తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అధికారులు ఇప్పటికే కేటాయించిన స్థలంలో వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఈ తరలింపు ప్రక్రియపై మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శీనుబాబు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం.