డ్రోన్‌తో విత్తనాలు విత్తడం సులువు : కలెక్టర్

డ్రోన్‌తో విత్తనాలు విత్తడం సులువు : కలెక్టర్

కృష్ణా: డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో విత్తనాలు విత్తడం సులువు, ప్రయోజనకరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం ఆధ్వర్యంలో జరిగిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. ప్రీ మాన్‌సూన్ డ్రై సీడింగ్ విధానంలో 30–32 రకాల మిశ్రమ విత్తనాలను డ్రోన్‌తో చల్లవచ్చని, సమయం ఆదా, కూలీల కొరత తగ్గుతుందని చెప్పారు.