విద్యా సంస్థలంటే... జీవన వ్యవస్థలు: రాష్ట్ర గవర్నర్

విద్యా సంస్థలంటే... జీవన వ్యవస్థలు: రాష్ట్ర గవర్నర్

NLG: విద్యా సంస్థలంటే కేవలం ఇటుకలు, నిర్మాణాలు కాదని, దార్శనికత, విలువలు శ్రేష్ఠత కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. నార్కెట్ పల్లి మండలంలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ముందుగా జిల్లా అధికారులు స్వాగతం పలికగా గౌరవ వందనం స్వీకరించారు.