గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి

ప్రకాశం: పోగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ గురువారం కనిగిరి పొగాకు వేలం కేంద్రంను సందర్శించారు. ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిల్లి తిప్పారెడ్డి ఆమెను కలిసి రైతుల సమస్యలను వివరించారు. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆమెను కోరారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ఆమె హామీ ఇవ్వడం జరిగింది.