జిల్లాలో పెరిగిన పాల ధరలు.. ఎంతంటే..?
కృష్ణా: ఇప్పటికే ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యుడిపై పాల ధరలు భారమయ్యాయి. లీటరు పాలపై రూ.2 చొప్పున ధర పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. పాల సేకరణ, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని, ఈ నెల 4వ తేదీ నుంచి ఈ ధరలు అమలులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మధ్య తరగతి ప్రజల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.