VIDEO: నాగుల చవితి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు
SKLM: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తన సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి పోలాకి మండలం మబగాం గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సుఖశాంతులతో, ఆనందంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.