పేదలకు వైద్య సాయం చెక్కు అందజేత
GDWL: అలంపూర్ నియోజకవర్గ పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అయిజ మండలం పులికల్లుకు చెందిన రాంపోగు ఎఫోన్కు వైద్య ఖర్చుల కోసం రూ.15 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఇవాళ క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.