రెవెన్యూ వినతులపై స్పష్టత ఉండాలి: కలెక్టర్
PPM: పీజీఅర్ఎస్ ద్వారా అందిన రెవెన్యూ వినతులపై స్పష్టత ఉండాలని కలెక్టర్ డా.ప్రభాకర్ రెడ్డి రెవెన్యూ అధికారులకు తెలిపారు. సమస్యను బాగా అర్ధం చేసుకున్నప్పుడే దానికి సరైన పరిష్కార మార్గం చూపగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్జీల పరిష్కారం చట్టాలకు లోబడి మాత్రమే చేపట్టాలన్నారు. సోమవారం సమస్యలు పరిష్కారంపై కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు.