ఘనగా బసవేశ్వరుడి జయంతి వేడుకలు
RR: నందిగామ మండల కేంద్రంలో బసవేశ్వరుడి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల వ్యవస్థ, అంటరానితనం అనే అంధకారాన్ని రూపుమాపడానికి ధైర్యంగా పోరాడిన వ్యక్తి బసవేశ్వరుడని పేర్కొన్నారు. అందరికీ సమానత్వమనే భావనను సమాజంలో తీసుకెళ్లిన గొప్ప తాత్వికుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము కృష్ణ పాల్గొన్నారు.