'కాళేశ్వరం నుంచి LMDకి నీటి తరలింపు అభూత కల్పన'

KNR: LMD రిజర్వాయర్‌కు కాళేశ్వరం నుంచి గతంలో నీటిని తరలించలేదని సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కరీంనగర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం LMDలో 5.7 TMCల నీరు ఉందని, ఏప్రిల్ 15 వరకు 6.5TMCల నీరు నిల్వ చేసి జులై 31 వరకు ప్రజలకు తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.