కెంగువలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం

VZM: గజపతినగరం మండలంలోని కెంగువ గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ మండల శాఖ ఉపాధ్యక్షులు మజ్జి గోవింద ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద ఇంటింటికి వెళ్లి ఏడాదిలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులతో పాటు భవిష్యత్తులో జరగబోయే పనులు గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.