పరుశురాం మాంగ్ కు 'దళితరత్న' అవార్డు

పరుశురాం మాంగ్ కు 'దళితరత్న' అవార్డు

ADB: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డా.అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మాంగ్ సమాజ్ అధ్యక్షుడు గాడేకర్ పరశురామ్ మాంగ్‌కు 'దళితరత్న' అవార్డు ప్రదానం చేశారు. సమాజ సేవలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు. ఈ అవార్డు దక్కడం పట్ల పరశురామ్ సంతోషం వ్యక్తం చేశారు.