VIDEO: దంతపల్లిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

VIDEO: దంతపల్లిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

MDK: రామాయంపేట మండలం దంతపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ మస్కూరి బాలరాజు ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని కొనియాడారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.