ఉక్రెయిన్‌కు కృతజ్ఞత లేదు: ట్రంప్
తను రూపొందించిన శాంతి ప్రణాళికను ఒప్పించేందుకు US అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిలో భాగంగానే ఉక్రెయిన్ ప్రభుత్వానికి కొంచెం కూడా కృతజ్ఞత లేదంటూ ట్రూత్‌లో పోస్టు చేశారు. తాను అధికారంలో ఉంటే ఈ యుద్ధం అసలు జరిగేదే కాదన్నారు. మరోవైపు రష్యా నుంచి ఈయూ ఇంకా చమురు కొనుగోలు చేస్తూనే ఉందని ఆరోపించారు.