భారత్ రియాక్షన్ స్ట్రాంగ్‌గా ఉండాలి: సచిన్ పైలట్

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థతి నెలకొంది. ఈ నేపథ్యంలో పాప్‌కు భారత్ గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కాంగ్రెస్ నేత సచిన పైలట్ వెల్లడించారు. మరో సారి ఇలాంటి ఘటనలు జరగకుండా భారత్ నుంచి ప్రతిస్పందన ఉండాలని కోరారు. ఈ విషయంలో విపక్షాలన్ని ఐక్యంగా ఉన్నాయని పేర్కొన్నారు.