'వడగాల్పుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి'
PPM: రాబోయే వేసవి దృష్ట్యా వడగాల్పుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈసారి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే పిడుగుల బారి నుంచి రక్షణపై ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని ఆదేశించారు.