అమెరికా ట్యాంకర్‌పై దాడి చేశాం: ఇరాన్
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రత కొనసాగుతోంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామితో దాడిచేసి ముంచేసిన విషయం తెలిసిందే. తాజాగా అందుకు ప్రతీకారంగా గల్ఫ్ తీరంలో అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వెల్లడించింది. దీంతో నౌకలో భారీ ఎత్తున మంటలు చెలరేగినట్లు తెలిపింది. అయితే ప్రాణనష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.