అనకాపల్లి తహసిల్దార్‌గా ఆనంద్
అనకాపల్లి తహసిల్దార్‌గా గారా ఆనంద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. చింతపల్లి తహసిల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌ను ప్రభుత్వం అనకాపల్లికి బదిలీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన ఆనంద్‌కు రెవిన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ రెవిన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఆనంద్ అన్నారు.