దేవరగొంది పునరావాస కాలనీలో కార్డెన్ సెర్చ్
WG: పోలవరం పరిధిలోని దేవరగొంది పునరావాస కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దీనిలో భాగంగా అపరిచిత వ్యక్తులు, పరారీలో ఉన్న నేరస్థుల కోసం పోలీసులు రహదారులన్నిటిని మూసివేశారు. ఇళ్లను సెర్చ్ చేసినట్లు పోలవరం సీఐ బాల సురేష్ బాబు చెప్పారు. మొత్తం 24 ద్విచక్ర వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేనందున వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.