రంజీల్లో సూపర్ ఫామ్‌లో జైస్వాల్
సౌతాఫ్రికాతో కీలక టెస్టు సిరీస్‌కు ముందు యశస్వీ జైస్వాల్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన యశస్వీ, రాజస్థాన్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ(67), రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగుల భారీ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే రంజీల్లో 1000 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు.