యూరియా వినియోగంపై జిల్లా కలెక్టర్ సమీక్ష

యూరియా వినియోగంపై జిల్లా కలెక్టర్ సమీక్ష

E.G: రైతులు అవసరానికి మించి యూరియాను వినియోగించకుండా, క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ పి. ప్రశాంతి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇవాళ రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద యూరియా వినియోగంపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 18,588 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామని ఇంకా 2,405 అందుబాటులో ఉందన్నారు.