పల్నాడు.. చారిత్రక సాహసాలకు చిరునామా
PLD: మన జిల్లా వీరత్వానికి, చారిత్రక సాహసాలకు నిలయం. ఇక్కడ జరిగిన ప్రసిద్ధ 'పల్నాటి యుద్ధం' గ్రామీణ నాయకత్వం, కులాల మధ్య సామాజిక పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. నాటి యోధుల పరాక్రమం నేటికీ జానపద గాథలుగా సజీవంగా ఉన్న విషయం తెలిసిందే. ఇవి ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక, గుర్తింపును తెచ్చిపెట్టాయి.