చౌరస్తాల సుందరీకరణకు ప్రత్యేక చర్యలు

MDK: పట్టణంలోని చౌరస్తాల సుందరీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం మెదక్ కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని మూడు చౌరస్తాలను ప్రత్యేక విద్యుత్ దీపాలు, ఆర్టిలరీలు, ఫౌంటెన్లతో అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.