ప్రధాని మోదీని కలిసిన శుభాంశు శుక్లా

ప్రధాని మోదీని కలిసిన శుభాంశు శుక్లా

యాక్సియం-4 అంతరిక్ష యాత్ర విజయవంతమైన తర్వాత తొలిసారిగా ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా భారత్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. మోదీకి శుక్లా యాక్సియం-4 మిషన్ ప్యాచ్‌ను బహుకరించారు. అలాగే అంతరిక్ష కేంద్రం నుంచి భూమి చిత్రాలను చూపించారు. అనంతరం ఇద్దరూ భారత్‌లో అంతరిక్ష రంగ అభివృద్ధి గురించి పలు అంశాలను చర్చించారు.