సీనియర్ న్యాయవాదికి నివాళులర్పించిన జడ్జ్
NTR: నందిగామ బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాది సుంకర సూర్య నారాయణ అనారోగ్యం కారణంగా మరణించారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రియాజ్ బార్ అసోసియేషన్‌తో కలిసి వారి భౌతికకాయాన్ని సందర్శించారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.