గ్రామంలో వైఫై పెట్టించిన సర్పంచ్ అభ్యర్థి
TG: గ్రామాల్లో సర్పంచ్‌గా గెలుపు కోసం అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం లంబాడిహెట్టి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి బాలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. తమ ఊరిలో నెట్వర్క్ సమస్యలు ఉండటంతో ఐదు చోట్ల వైఫై ఏర్పాటు చేయించాడు. సర్పంచ్ ఎన్నికల హామీలో భాగంగా.. ముందుగానే గ్రామంలో వైఫై ఏర్పాటు చేశాడు.