‘మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు’

‘మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు’

E.G: రాజమండ్రి పట్టణంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు మంగళవారం సాయంత్రం ప్రత్యేక డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు రాజమండ్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించగా, మద్యం సేవించి వాహనాలు నడిపిన 37 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.