VIDEO: ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం.. చిన్నారికి అస్వస్థత
ప్రకాశం: కంభంలో ఫరీద్ అనే వ్యక్తి తన కూతురికి జ్వరం రావటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. చిన్నారికి వాంతులు, విరోచనాలు అవుతుండడంతో చికిత్స అందించిన ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా స్పందించారన్నారు. అనంతరం చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాలం చెల్లిన సిరప్ వాడటం వల్లే ఇలా జరిగిందని ప్రభుత్వ వైద్యులు తెలిపారు.