VIDEO: రోడ్ సైడ్ టిఫిన్ చేస్తున్నారా..?
విశాఖ రోడ్లపై బండ్లలో టిఫిన్లు విక్రయిస్తున్న కొందరు వ్యాపారులు పాచిపోయిన ఆహారం వాడుతున్నట్లు బయటపడింది. ఎంవీపీ కాలనీలో “నేతి ముత్యాల ఇడ్లీలు” వంటి పేర్లతో అమ్ముతున్న బండ్లపై జీవీఎంసీ షీ టీమ్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మష్రూమ్, పనీర్ కర్రీలు దుర్వాసన వస్తున్నట్లు, నిల్వ ఉంచిన పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.