పాఠశాలలో పోలాల అమావాస్య

MNCL: దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పోలాల అమావాస్య పండుగను నిర్వహించారు. పోలాల అమావాస్య పురస్కరించుకొని శుక్రవారం ఆ పాఠశాల ఆవరణలో రైతులు, బసవన్నలతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రైతులకు, బసవన్నలకు ఉన్న అనుబంధాన్ని పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య విద్యార్థులకు వివరించారు.