VIDEO: కోదాడలో ఘనంగా శ్రీరామ శోభాయాత్ర
SRPT: కోదాడ 12వ వార్డులో స్పారోజ్ యూత్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీరాముని నామస్మరణతో వార్డు వీధులన్నీ మార్మోగాయి. భక్తులు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండపనేని నాగేశ్వరరావుతో పాటు యూత్ సభ్యులు పాల్గొన్నారు.