'శక్తి యాప్ ఉంటే ఒక వ్యక్తి తోడు ఉన్నట్లే'

'శక్తి యాప్ ఉంటే ఒక వ్యక్తి తోడు ఉన్నట్లే'

SKLM: శక్తి యాప్ మన వద్ద ఉంటే ఒక వ్యక్తి మనకి తోడుగా ఉన్నట్లేనని శక్తి టీం మహిళ హెడ్ కానిస్టేబుల్ అమ్మాజీ తెలిపారు. గురువారం సరుబుజ్జిలి మండల ఎంపీడీవో కార్యాలయంలో మహిళ ఉద్యోగినులకు శక్తి యాప్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.