బైక్ దొంగతనాల ముఠా అరెస్ట్..!

బైక్ దొంగతనాల ముఠా అరెస్ట్..!

NLG: జల్సాల కోసం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను కేతేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.7 లక్షల విలువైన 8 బైకులు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు. పట్టుబడిన వారిలో ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు బాల నేరస్థులు ఉన్నారు. వాహనాల తనిఖీల్లో పట్టుబడి పలు చోరీలు చేసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.