నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం

నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం

కోనసీమ: మండపేట పురపాలక సంఘం కౌన్సిల్ అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు పురపాలక సంఘం చైర్‌పర్సన్ పతి వాడ నూక దుర్గా రాణి సోమవారం పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాల్‌లో ఈ సమావేశం నిర్వహించి, అజెండాలోని పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అధికారులు విధిగా హాజరు కావాలని కోరారు.