మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
HNK: మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో ఎస్డిఎఫ్ నిధుల నుంచి 20 లక్షలతో నిర్మించిన మహిళా కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.