నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MNCL: లక్సెట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ గణేష్ పేర్కొన్నారు.11కేవీ లైన్ల మరమ్మతుల కారణంగా మండలంలోని దౌడపల్లి, మోదెల, చందారం, వెంకట్రావుపేట్, పోతపల్లి 11కేవీ ఫీడర్ల పరిధిలోని గ్రామాలకు బుధవారం ఉదయం 8 గంటల నుంచి 11గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.