తాడిపత్రిలో వికసించిన బ్రహ్మ కమలం
ATP: తాడిపత్రి సంజీవనగర్‌లో నివాసం ఉంటున్న వెంకటనాయుడు ఇంటిలో శనివారం రాత్రి బ్రహ్మకమలం వికసించింది. కార్తీక మాసంలో మాత్రమే ఈ మొక్క పుష్పిస్తుందని యజమాని వెంకటనాయుడు తెలిపారు. రెండేళ్ల కిందట బెంగళూరు నుంచి ఈ మొక్కను తెచ్చానని, అప్పట్లో ఇది బ్రహ్మకమలం మొక్క అని తనకు తెలియదన్నారు. ఈ పుష్పం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పంగా ఉందని ఆయన తెలిపారు.