ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

NLG: గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. కనగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను మంగళవారం ఆమె పరిశీలించారు. అలాగే ఒక ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.