మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
జగిత్యాల జిల్లా ధర్మపురిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మపురిలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు గత ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరిగిందని అన్నారు. ఆరు మండలాల్లో సుమారు 4898 ఎకరాల్లో సాగు జరిగిందని, మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు.