ఆదర్శ ఎస్పీగా పేరుగాంచిన సతీష్ కుమార్

GNTR: జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను సత్యసాయి జిల్లాకు ఎస్పీగా నియమించారు. తన పదవీ కాలంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో విశేష ఫలితాలు సాధించారు. గ్యాంగ్‌స్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు సైబర్ క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఆయన ముందున్నారు.